ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై వచ్చే జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రఘుపతి మాట్లాడారు.

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా.. అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టతతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు.

కాగా, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే కొన్ని నియోజకవర్గాల విషయంలో సమస్య ఉండటంతో ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం సూచించిన విధంగానే కమిటీ నివేదిక రూపొందిస్తే ఏపీలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. అయితే విశాఖపట్నం జిల్లా అరకు లోక్ సభ నియోజకవర్గం విషయంలో సందిగ్ధత నెలకొంది.