వచ్చే ఎన్నికల్లో అదే జరిగితే.. ఉరివేసుకుంటా

ap deputy cm ke krishna murthy challnge to ycp
Highlights

మీడియా సమావేశంలో కేఈ కృష్ణమూర్తి

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీనే గెలుస్తుందని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. రాజీనామాల పేరుతో వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాటకాలు ఆడుతోందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు.

 బీజేపీతో వైసీపీ కుమ్మక్కై రాజీనామాల వ్యవహారాన్ని నాన్చుతున్నారని ఆరోపించారు. బీజేపీ పంచన చేరిన వైసీపీకి 2019లో పుట్టగతులు ఉండవని కేఈ అన్నారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని కుప్పిగంతులు వేస్తున్నారని దుయ్యబట్టారు. 

టీడీపీని విమర్శించడమే జగన్, పవన్‌ పనిగా పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలిసే ప్రసక్తే లేదని...ఇది పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. అదే జరిగితే తాను ఉరి వేసుకుంటానని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సవాల్ విసిరారు.

loader