పవన్ మీద వ్యాఖ్యలు చేస్తూ జగన్ మీద నోరు జారిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి
పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులుగా జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు.
తిరుమల : కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నారు కదా.. అని కానివారిని తిట్టబోయి.. ఆయన వారిపై నోరు పారేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. అలాంటి పొరపాటునే ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి (AP Deputy CM Narayanaswamy)చేశారు. స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలు (YCP leaders) పోటాపోటీగా ప్రెస్మీట్లు పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పై దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం స్వామి భక్తిని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులుగా జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. అసలే సోషల్ మీడియా ఇలా హింట్ ఇస్తే అలా అల్లుకుపోతుంది. మరి ఇక నారాయణస్వామిని వదులుతుందా? మీమ్స్, సెటైర్స్ తో నారాయణ స్వామిని నెటిజనం ఆటాడేసుకుంటోంది.
ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు: రోజుకు 8 మంది ఎంపీలతో జగన్ భేటీ
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు సహా పోసాని (Posani krishna Murali) వంటి వారు ప్రెస్ మీట్లలో పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా నిన్న పోసాని పై పవన్ అభిమానులు దాడి చేసే వరకు వెళ్లారు.
నిన్న పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు ప్రచురించడానికి కూడా వీలు లేని వ్యాఖ్యలతో కూడుకొని ఉన్నాయి. వాస్తవానికి మొన్నటి ప్రెస్ మీట్ తరువాత పోసానిపై పవన్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణమురళీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని అంటూ తాను సైతం బూతు పురాణాన్ని ఓపెన్ చేసాడు.