కర్నూలు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. వైఎస్ జగన్‌ అవినీతి చక్రవర్తి అంటూ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీని జగన్‌ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. కేసుల కోసమే ప్రధాని మోదీకి జగన్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు. సీఎం కాకముందు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిది కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి అని ఆరోపించారు. 

అలాంటి వైఎస్‌ సీఎం అయ్యాక వందల కోట్లు ఎలా సంపాదించారని కేఈ ప్రశ్నించారు. వైఎస్ సీఎం అయితే ఇంత డబ్బులు ఎలా సంపాదించారు అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే జగన్ ఎంత అవినీతిపరుడో అర్థమవుతుందని కేఈ కృష్ణమూర్తి చెప్పుకొచ్చారు.