Asianet News TeluguAsianet News Telugu

మానవత్వాన్ని చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని: క్షతగాత్రుడిని కారులో ఆసుపత్రికి తరలింపు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తన వాహనంలో ఆసుపత్రికి పంపారు. ఆసుపత్రికి ఫోన్ చేసిన క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

AP Deputy CM Alla Nani helped injured person to shift hospital in Vijayawada
Author
Vijayawada, First Published Jan 17, 2022, 7:55 PM IST

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం Alla Nani ఆసుపత్రికి పంపించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు.

AP Deputy CM Alla Nani helped injured person to shift hospital in Vijayawada

సోమవారం నాడు Tadepalle సిఎం  క్యాంపు ఆఫీస్ లో corona సమీక్ష ముగించుకొని  వస్తున్న సమయంలో  Vijayawadaలోని బెంజి సర్కిల్ వద్ద రోడ్డు పక్కన పడిఉన్న క్షతగాత్రుడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని  గమనించారు.

AP Deputy CM Alla Nani helped injured person to shift hospital in Vijayawada

Road accidentకి గురై తలకు బలమైన గాయంతో రోడ్డు ప్రక్కన  Srinivas Reddy పడిపోయాడు. ఈ విషయాన్ని మంత్రి ఆళ్ల నాని గుర్తించారు. తన  వాహనాన్ని వెంటనే నిలిపాడు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొన్నాడు. తన పేషి సిబ్బంది ద్వారా ప్రోటోకాల్ వాహనంలో హెల్ప్ Hospital కి క్షతగాత్రుడిని పంపారు మంత్రి. 

హెల్ప్ హాస్పిటల్ యాజమాన్యంతో phoneలో మాట్లాడి క్షతగాత్రుడు శ్రీనివాస్ రెడ్డి కి మెరుగైన వైద్యం అందించాలని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు.ఆపదలో ఆపడ్బంధావుడుగా తన ప్రాణాలు కాపాడిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి  శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios