పవన్ కళ్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు  సత్యనారాయణ   మండి పడ్డారు.  పవన్  కళ్యాణ్  ఉన్మాద ప్రసంగాలు  చేస్తున్నారన్నారు. సినిమాలు కాదనే  విషయాన్ని  పవన్  కళ్యాణ్  గుర్తుంచుకోవాలన్నారు. 

అమరావతి: ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్మాద ప్రసంగాలు చేయరని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్పారు.మంగళవారంనాడు అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.తనపై వైసీపీ చేస్తున్న విమర్శలపై పనన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.మంత్రులు,వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.తనను ప్యాకేజీ స్టార్ అని వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.

కర్రకు కర్ర, కత్తికి కత్తి, రాళ్లకు రాళ్ళు అని ఎవరూ మాట్లాడరని చెప్పారు. ఇవన్నీ ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాదానికి పాల్పడ్డామని చెప్పే వ్యక్తులే ఇలాంటివి నేర్పుతారన్నారు. పవన్ ఒక్కరే చెప్పులు చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.పవన్ చెప్పేది ఉగ్రవాద ప్రసంగం, చదివేది ఉగ్రవాద సాహిత్యమని డిప్యూటీ సీఎం విమర్శించారు.

 రాజకీయాలు దీర్ఘకాలం పాటు చేస్తామని వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు.ఇంత అసహనం తో మాట్లాడుతున్న పవన్ ను రాజకీయ నాయకుడిగా ఎలా గుర్తిస్తారని ఆయన అడిగారు.

అసహనం ఎక్కువై చెప్పులు చూపడానికి రాజకీయం సినిమా కాదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. ఉన్మాదం గా మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి చెందిన యువతను పెడ దోవ పట్టించేలా పవన్ కళ్యాణ్ ప్రవర్తన ఉందన్నారు.ప్యాకేజీ లో భాగం గానే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబును కలిశారన్నారు.రాజకీయ పార్టీ నడపాలని అనుకునేవాళ్లు సిద్ధాంత పరంగా పోరాటం చేయాలని మంత్రి సూచించారు.

వంగవీటి రంగా హత్య విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తప్పుబట్టారు. రంగా హత్య విషయంలో కాపులు , బలిజలు బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

alsoread:మారుతున్న రాజకీయం: విజయవాడలో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ

2024లో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వంగవీటి రంగా అభిమానులు సిద్దంగా ఉన్నారన్నారు.వంగవీటి రంగాను హత్యచేయించిన వారితో పవన్ కళ్యాణ్ అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ అసహనానికి అర్ధం పర్ధం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.