అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన ఓ వ్యాఖ్యపై స్పీకర్ ప్రతిస్పందిస్తూ సీరియస్ అయ్యారు.

"నేను మంత్రి పదవి తీసుకుంటా, నీ సంగతి చూస్తా, కంగారు పడవద్దు" అని స్పీకర్ తమ్మినేని సీతారాం అచ్చెన్నాయుడిని హెచ్చరించారు. చంద్రబాబు ప్రసంగానికి స్పీకర్ అడ్డు పడుతుండడంతో మంత్రి పదవి తీసుకుని మాట్లాడాలని అచ్చెన్నాయుడు అన్నారు .దాంతో తమ్మినేని తీవ్రంగా ప్రతిస్పందించారు.

Also Read: చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ను కోల్పోయాం: వైఎస్ జగన్

కాగా, మరో సందర్భంగాలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు చంద్రబాబు చురకలు అంటించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళమని, అలాంటి జిల్లా నుంచి వచ్చి చాలా సందర్భాల్లో చాలా విన్నామని, ఏం చేశామంటే చెప్పడానికి ఏమీ లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అమరావతిపై అవినీతి ఆరోపణలు చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్లారని ఆయన గుర్తు చేశారు వైసీపీ నేతలు ఏమీ సాధించలేకపోయారని చంద్రబాబు అన్నారు. అయినా సిగ్గులేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

Also Read: చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా: జగన్ తో చంద్రబాబు

వైసీపీ నేతలకు సిగ్గులేదని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేవారు కూడా మాట్లాడుతున్నారని ఆనయ ్న్నారు. తాను అవన్నీ ప్రస్తావించదలుచుకోలేదని చంద్రబాబు అన్నారు.