అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి, ఖనిజశాఖలకు సెక్రటరీగా కె.రాంగోపాల్‌, విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి బి.కోటేశ్వరరావులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

యువజన సర్వీసులకు సి.నాగరాణి, సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌గా పి.అరుణ్‌బాబు, లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా ఎం.విజయసునీత, ఎంప్లాయిమెంట్‌ మరియు ట్రైనింగ్‌ డైరెక్టర్‌గా లావణ్య వేణిలను బదిలీ చేశారు. 

మరోవైపు కాపు కార్పొరేషన్‌ ఎండీగా హరీంద్రప్రసాద్‌, రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌గా రావిలాల మహేష్‌కుమార్‌ బదిలీ అయ్యారు. ఇకపోతే ఏపీ లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఎం. హరినారాయణను నియమించారు. 

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ బాధ్యతను హరినారాయణకు అప్పగించింది. 25 లక్షల ఇళ్ల సైట్లు గుర్తించాల్సిన బాధ్యత హరినారాయణకు అప్పగించింది. ఇకపోతే ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా హరినారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.