అమరావతి: ఆర్థిక వనరులు లేకపోవడంతో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వం అనవసర ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అవసరం లేకున్నా అనవసరంగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకున్నారని ఆరోపిస్తూ వారిపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. 

సిఫార్సులతో అవసరానికి మించి ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎంఆర్ఎఫ్ లో పని చేస్తున్న 42 మంది సిబ్బందిని తొలగిస్తూ మెమో జారీ చేసింది. అలాగే  సీఎంవోలో కూడా అవసరానికి మించి సిఫారసులకు తలొగ్గి ఔట్ సోర్సింగ్ లో భారీ సంఖ్యలో కూడా ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. 

అలాగే సమాచార శాఖలో ఔట్ సోర్సింగ్ విభాగంలో కూడా అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్తించారు. వారిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలుస్తోంది.