కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కరోనా టీకా తీసుకున్నారు. ఆయన వెలగపూడిలోని సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ఆయన తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
వెలగపూడి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.వెలగపూడిలో గల సచివాలయం మూడవ భవనంలోని డిస్పెన్సరీలో బుధవారం ఆయన కోవాక్సిన్ ఇంజక్సన్ మొదటి డోస్ వేయించుకున్నారు.
మళ్లీ నాలుగు వారాల అనంతరం రెండవ డోస్ ఇంజక్సన్ వేయించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ అరగంట పాటు డిప్సెన్సరీలోని అబ్జర్వేషన్ రూమ్ లో ఉన్నారు. ఆ తదుపరి తన కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జెడి డాక్టర్ .శ్రీహరి, గుంటూరు డిఎంఅండ్ హెచ్చ్ఓ డా.యాస్మిన్, డిపిఎంఓ డా.మన్మోహన్, డిస్పెన్సరీ వైద్యులు డా.నాగ చక్రవర్తి, డా.గీతా కణ్యాళ్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష కూడా నిర్వహించారు.