Asianet News TeluguAsianet News Telugu

ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత ఉదృతమవుతోంది. 

AP Council Chairman Sharif tests COVID19 positive
Author
Amaravathi, First Published Sep 1, 2020, 11:04 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత ఉదృతమవుతోంది. సామాన్యుడు మొదలు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వీఐపీలు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇలా ఇప్పటికే అనేకమంది  కరోనా బారిన పడగా తాజాగా శాసనమండలి ఛైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంలో ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఇప్పటికే రాష్ట్రంలో అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా వైసిపి ఎమ్మెల్యే భూమన  కరుణాకర్ రెడ్డికి కూడా కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. భూమనకు ఫోన్ చేసిన జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో ఒకరి వెంట ఒకరు కరోనా బారినపడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

READ MORE  తూర్పుగోదావరిలో అదే జోరు: ఏపీలో 4,34,771కి చేరిన కరోనా కేసులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో సీఎం పర్యటించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేతలు, మీడియా సిబ్బందికి అధికారులు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డికి పాజిటివ్‌గా తేలడంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో అవినాశ్‌తో కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్న వారిలో ఆందోళన నెలకొంది. ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు నేతలు కరోనా బారినపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. అయితే కరోనా లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios