Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ స్కాం: ఉమెన్ చాందీ

రాఫెల్ స్కాంపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ డిమాండ్ చేశారు. 2జీ స్కాంతో పోల్చితే రాఫెల్ స్కాం 3రెట్లు ఎక్కువ అని ఆరోపించారు.

ap congress incharge umen chandhi on rafel scam
Author
Vijayawada, First Published Sep 24, 2018, 5:06 PM IST

విజయవాడ: రాఫెల్ స్కాంపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ డిమాండ్ చేశారు. 2జీ స్కాంతో పోల్చితే రాఫెల్ స్కాం 3రెట్లు ఎక్కువ అని ఆరోపించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాఫెల్ స్కాంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విమానాల ధరలు ఇష్టమెుచ్చినట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఉమెన్ చాందీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉమెన్ చాందీ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. 

అక్టోబర్ 2నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రీ మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు చరిత్రలో రాఫెల్ స్కాం లాంటి పెద్ద కుంభకోణం ఎక్కడా జరగలేదని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. రాఫెల్ స్కాంపై గవర్నర్ నరసింహన్ కు మెమోరాండం ఇద్దామంటే స్పందించడం లేదని వాపోయారు. కాంగ్రెస్ నేతలకు గవర్నర్ ఎందుకు సమయం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios