Asianet News TeluguAsianet News Telugu

సీఎం వైయస్ జగన్ మరో రికార్డు, తర్వాత స్థానం పెద్దిరెడ్డిదే....

ఇక అప్పులు విషయానికి వస్తే అత్యధికంగా అప్పులు ఉన్న మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డు సృష్టించారు. రూ.20 కోట్లు అప్పులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆయన తర్వాత స్థానంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నిలిచారు. ఆయన అప్పులు విలువ రూ.12 కోట్లుకాగా మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రూ.5 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.  
 

ap cm ys jaganmohanreddy assets rs.510 crores
Author
New Delhi, First Published Jun 26, 2019, 9:11 AM IST

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో అత్యంత ధనవంతుడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. వైయస్  జగన్ కేబినెట్ లో 88శాతం మంది కోటీశ్వరులు ఉంటే వారిలో జగన్ మెుదటి స్థానంలో నిలిచారు. 

ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా సంపన్నుల జాబితాను విడుదల చేసింది ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌). వైయస్ జగన్ కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉన్నారని వారు సమర్పించిన ప్రమాణ పత్రాల ఆధారంగానే వెల్లడించినట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 510 కోట్ల రూపాయల ఆస్తులతో మెుదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు రూ.130 కోట్లుగా స్పష్టం చేసింది. ఇకపోతే ఆ తర్వాతి స్థానంలో మరోమంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఉన్నారు. గౌతంరెడ్డి ఆస్తులు రూ.61 కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు.  

ఏపీ కేబినెట్ లోని సీఎం జగన్ తోసహా 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులే కావడం విశేషం. అంటే జగన్ కేబినెట్ లో88శాతం మంది కోటీశ్వరులే. ఇకపోతే మంత్రుల సగటు ఆస్తి విలువ రూ. 35.25 కోట్లుగా వెల్లడించింది ఏడీఆర్ సంస్థ.
 
ఇకపోతే కేసుల విషయానికి వస్తే వైయస్ జగన్ మంత్రివర్గంలో 17 మంది పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అంటే 65శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే వీరిలో 9 మంది(అంటే 35శాతం )పై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి.
 
ఇక అప్పులు విషయానికి వస్తే అత్యధికంగా అప్పులు ఉన్న మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డు సృష్టించారు. రూ.20 కోట్లు అప్పులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆయన తర్వాత స్థానంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నిలిచారు. ఆయన అప్పులు విలువ రూ.12 కోట్లుకాగా మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రూ.5 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.  

ఐటీ రిటర్న్స్ ప్రకారం కుటుంబ ఆదాయాల విషయానికి వస్తే అక్కడా వైయస్ జగన్మోహన్ రెడ్డి మెుదటి స్థానంలో నిలిచారు. 2017-18 లెక్కల ప్రకారం వైయస్ జగన్ కుటుంబ ఆదాయం రూ.38 కోట్లు కాగా అందులో సొంత ఆదాయం రూ.25 కోట్లుగా చూపించారు. 

ఇకపోతే మరోమంత్రి అవంతి శ్రీనివాసరావు కుటుంబ ఆదాయం రూ.3కోట్లుకాగా ఒకకోటి సొంత ఆదాయంగా చూపించారు. ఇకపోతే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబ ఆదాయం రూ.కోటి కాగా ఆయన సొంత ఆదాయం రూ.28 లక్షలుగా చూపించారు. 

విద్యార్హతల విషయానికి వస్తే సీఎం వైయస్ జగన్ కేబినెట్ లో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసించిన వారు 8 మంది ఉన్నారు. అంటే జగన్ కేబినెట్ లో 31 శాతం మంది ఇంటర్మీడియట్ లోపే చదువుకున్నవారు ఉన్నారు. ఇకపోతే 18 మంది డిగ్రీ, ఆపై ఉన్నత చదువులు చదివారు. అంటే 69శాతం మంది జగన్ కేబినెట్లో డిగ్రీతోపాటు ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. 

మరోవైపు వయసుపరంగా చూస్తే జగన్ కేబినెట్లో 31 నుంచి 50 ఏళ్ల మధ్యలోపు ఉన్నవారు 12 మంది ఉన్నారు. అంటే జగన్ కేబినెట్ లో 46శాతం మంది 50 ఏళ్లలోపు యువకులు ఉండగా, 14 మంది మంత్రులు 70ఏళ్ల లోపు వారు ఉన్నారు. మెుత్తానికి జగన్ కేబినె లో 46 శాతం మంది యువకులు, 54 శాతం మంది 50ఏళ్లుపైబడిన వారు ఉన్నారన్నమాట. 

Follow Us:
Download App:
  • android
  • ios