ఏపీలో ఇసుక లభ్యత, రవాణా, ధర తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... డిపోల్లో ఇసుకను అందుబాటులో పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించాలని... పోర్టల్ ఆన్ చేయగానే వెంటనే నిల్వలు అయిపోయాయనే భావన పొగొట్టాలని జగన్ సూచించారు.

Also Read:పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు జగన్ సర్కార్ తీపి కబురు

ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్ బుకింగ్ వంటి ఎస్‌సీ, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని సీఎం సూచించారు.

చిన్న నదుల నుంచి ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లడానికి స్థానికులను అనుమతించాలని ఆదేశించారు. అయితే పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్న ముఖ్యమంత్రి... ఎడ్ల బళ్ల ద్వారా ఇసుకను అక్రమంగా వేరే చోటికి తరలిస్తే చర్యలు తప్పవని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Also Read:పచ్చగా కనపడితే చాలు, కెలికి మరీ తిట్టించుకుంటాడు.. విజయసాయి రెడ్డి

డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టాలన్న జగన్... ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ  ఉంచాలని జగన్ సూచించారు.