అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహిన్ ను కలిశారు. శనివారం మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్  విజయవాడ చేరుకున్నారు. 

విజయవాడలో గేట్ వే హోటల్ లో బస చేసిన ఆయనను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే జాబితాను గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. సీఎం జగన్ అందజేసిన మంత్రుల జాబితాను గవర్నర్ ఆమోదించారు.

ఆ తర్వాత  మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లపై గవర్నర్ తో సీఎం వైయస్ జగన్ చర్చించారు. ఇకపోతే శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద 25 మందితో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.