Asianet News TeluguAsianet News Telugu

‘‘అన్నా.. అమ్మ నిన్ను చూడాలంటోంది’’.. పెద్దమనసు చాటుకున్న సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడి ఆయనను చూడాలని వుందని కబురుపెట్టిన ఓ మహిళను ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ap cm ys jagan visits injured woman home in tirupati
Author
Tirupati, First Published Dec 3, 2021, 10:19 PM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడి ఆయనను చూడాలని వుందని కబురుపెట్టిన ఓ మహిళను ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటనలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని (tirupati) సరస్వతి నగర్‌లో శుక్రవారం పర్యటిస్తున్నారు సీఎం జగన్‌. ఆ సమయంలో అక్కడకు ఓ యువతి వచ్చింది. ఆమె పేరు వైష్ణవి... నేరుగా జగన్‌ దగ్గరకు వెళ్లి.. ‘‘అన్నా.. అమ్మ నిన్ను అమ్మ చూడాలని అంటోంది’’ అని చెప్పింది. కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల ఆమె మంచానికే పరిమితమైందని చెప్పింది.

దీంతో చలించిపోయిన వైఎస్ జగన్..  వైష్ణవి ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లి.. అనారోగ్యంతో ఉన్న ఆమె తల్లిని పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం మహిళా యునివర్సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైష్ణవి తల్లి విజయలక్ష్మీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు ప్రమాదం జరిగిన తీరును, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్..  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం నేరుగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడంపై  విజయకుమారి, ఆమె భర్త గజేంద్ర, కుమార్తె వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ALso Read:కాలినొప్పి తగ్గిందా మామయ్య..? పరామర్శకు వెళ్లిన సీఎం జగన్ నే పరామర్శించిన చిన్నారులు

ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించిన సీఎం తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు ఎస్టీ కాలనీ, ఏర్పేడు మండలం పాపానాయుడు పేటలో సీఎం జగన్ పర్యటించారు.  

 

ap cm ys jagan visits injured woman home in tirupati

 

kadapa district జిల్లా పర్యటన అనంతరం నేరుగాchittoor district రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి ys jagan చేరుకున్నారు. అక్కడ నుంచి రేణిగుంట మండలంలో వరద ప్రభావిత వెదుళ్ల చెరువు ఎస్టి కాలనీలో ఆయన పర్యటించారు. వరద ప్రభావాన్ని పరిశీలిస్తూనే ప్రభుత్వ సహాయం, పునరావాసం అందిందా? కలెక్టర్ సహా అధికారులు మిమ్మల్ని పరామర్శించారా? అంటూ సీఎం జగన్ నేరుగా బాధిత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన తమను, తమ కుటుంబాలను ప్రభుత్వ యంత్రాంగం ఆదుకుందని బాధితులు సీఎంకు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios