Asianet News TeluguAsianet News Telugu

ఈనెల 27న ప్రకాశం జిల్లాకు సీఎం వైఎస్ జగన్.. వివరాలివే..!!

ఈనెల 27న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో (prakasam district) పర్యటించనున్నారు. నెల 27న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) కుమార్తె రిసెప్షన్ కార్యక్రమం ఎర్రగొండపాలెంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు ముఖ్యమంత్రి

ap cm ys jagan to visit prakasam district on december 27th
Author
Amaravathi, First Published Dec 24, 2021, 8:58 PM IST

ఈనెల 27న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో (prakasam district) పర్యటించనున్నారు. నెల 27న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (adimulapu suresh) కుమార్తె రిసెప్షన్ కార్యక్రమం ఎర్రగొండపాలెంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు ముఖ్యమంత్రి. సీఎం రాక సందర్భంగా ఎర్రగొండపాలెంలో భద్రతా ఏర్పాట్లను ఈరోజు పోలీసులు పరిశీలించారు.

ఇందులో భాగంగా హెలీప్యాడ్, వీఐపీ గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం, రిసెప్షన్ జరిగే వేదికను జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు, బారికేడ్లలను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కాగా ఈనెల 17న హైదరాబాద్‌లో మంత్రి సురేష్ కుమార్తె వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

ALso Read:ప్రతి పార్లమెంట్ పరిధిలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ: పులివెందులలో సీఎం జగన్

అంతకుముందు రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. పులివెందులలోని ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్  రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం  Ys Jagan శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో Aditya Birla ఒకటని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.గార్మెంట్స్ తయారీలో ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 110 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2112 మందికి ఉపాధి కల్పించనుంది కంపెనీ.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటి అని సీఎం జగన్ చెప్పారు.ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు  వస్తాయని సీఎం జగన్ చెప్పారు. ఇలాంటి మంచి కంపెనీ Pulivendulaలో వస్త్ర పరిశ్రమను స్థాపించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ఆదిత్య బిర్లా కంపెనీ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకోవడం చారిత్రాత్మక ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా కంపెనీలో సుమారు 85 శాతం మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించారని సీఎం చెప్పారు.  పులివెందులలో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆదిత్య బిర్లా కంపెనీ యాజమాన్యానికి సీఎం జగన్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios