ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ వేడి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ను కలుస్తుండడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

మండలిలో ఇటీవలి పరిణామాలపై గివెర్నర్ తో చర్చిస్తారని కొందరంటున్నారు. మండలిలో కనీసం ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ అవలేదు. ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అవకపోవడంతోపాటుగా మండలిలో జరిగిన బహ బహి గురించి కూడా గవర్నర్ తో చర్చించే ఆస్కారం కూడా ఉంది. 

ఇక వీటితోపాటుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కూడా చర్చకు వచ్చేదిలా కనబడుతుంది. రేపటిలోగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కారం=న వ్యాజ్యాన్ని దాఖలు చేస్తారు అన్న ప్రచారం సాగింది. కానీ ఆయన ఈరోజు దానిని దాఖలు చేయడంలేదు అని తెలియవస్తుంది. 

తనను తిరిగి నియమించామని హై కోర్టు ఆదేశాలికిచ్చినప్పటికీ... సుప్రీమ్ కోర్టు హుప్గ్ కౌర్తి ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ తనను నియమించడంలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేస్తారు నేడు అని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తాము ఇప్పుడు అత్యవసరంగా ఆయనను పునర్నియమించాల్సిన అవశర్మ లేదని అంటున్నారు. 

ఇక దానితోపాటుగా సీఆర్డీఏ విషయం కూడా ఎమన్నా చర్చకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి రాజధాని తరలింపు ఇప్పుడు ఉండబోదు అని అన్నారు. ఇవాళ బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. 

దీనికి తోడుగా భూములిచ్చిన రైతులకు అందాల్సిన కొలు కూడా అందింది. అందరూ రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు పడ్డాయి. అమరావతిలో వేగంగా పరిణామాలు మారుతున్న నేపథ్యంలో భేటీ ఆసక్తి రేపుతోంది. 

మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ధృఢనిశ్చయంతో ఉందనడానికి రుజువుగా ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో నేటి జగన్ భేటీ పై తీవ్ర స్థాయిలో చర్చలు 

ఎవరు ఎన్ని ఊహాగానాలు చేసినా... జగన్, గవర్నర్ ఇరువురు కూడా ఒకరితో ఒకరు మాత్రమే చర్చించుకుంటారు. ఆ విషయాలు మనకు బయటకు రావు. వేచి చూడాలి ఇద్దరి మధ్య ఏ విషయంలో చర్చలు జరుగుతాయో...!