అమరావతి:ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ప్రతి ఏటా రైతుకు రూ.13,500 పెట్టుబడి సహాయం అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 
శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. వరుసగా రెండో ఏడాది రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.పార్టీలకు అతీతంగా  పెట్టుబడి సహాయం అందజేస్తున్నట్టుగా చెప్పారు. రైతు భరోసా కింద ప్రతి అన్నదాతకు ఏడాదికి రూ. 13,500 కోట్లు సహాయం చేస్తున్నామన్నారు. 

ఏ రైతుకైనా ఇబ్బంది ఏర్పడితే 1902 నెంబర్ కు ఫోన్ చేయాలని సీఎం  జగన్ సూచించారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13,500 అందజేయనున్నట్టుగా సీఎం చెప్పారు. అప్పులతో సంబంధం లేరకుండా రైతులకు పెట్టుబడి సహాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.కౌలు రైతులకు కూడ రైతు భరోసా పథకం కింద సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు.  కౌలు రైతులకు బ్యాంకుల్లో రూ. 7500 జమ చేస్తున్నామన్నారు. 

రైతు భరోసా పథకం కింద 49 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. గతేడాది రూ.6,350 కోట్లు విడుదల చేశామన్నారు. ఇవాళ రూ.5,500 రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రెండు వేలు ఇచ్చాం  ఇవాళ రూ.5500 ఇస్తున్నాం, అక్టోబర్ లో రూ. 4 వేలు, సంక్రాంతికి రూ. 2 వేలు రైతులకు అందిస్తామన్నారు. రైతు భరోసా కింద బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదును పాత బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకోవని సీఎం స్పష్టం చేశారు. 

also read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 57 కేసులు, మొత్తం 2,157కి చేరిక

 ఏపీలో తమ ప్రభుత్వం ఏర్పడి మే 30వవ తేదీకి ఏడాది పూర్తి కావొస్తోంది. దీన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టుగా జగన్ తెలిపారు. రైతు భరోసా పథకం కింద  ఎవరి పేర్లైనా మిస్సైతే గ్రామ సెక్రటరీ వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.