Asianet News TeluguAsianet News Telugu

రుణమాఫీ హామీ ఇచ్చి.. చేతులేత్తేశారు, వడ్డీ తడిసిమోపిడవుతోంది: బాబు పాలనపై జగన్ విమర్శలు

వడ్డీలు చెల్లించలేక తడిసి మోపడయ్యాయని 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి వుంటే అక్కడితో భారం పోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని .. అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామని జగన్ చెప్పారు

ap cm ys jagan slams tdp chief chandrababu naidu over loan waiver
Author
Amaravati, First Published Sep 15, 2021, 6:16 PM IST

తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు వల్లే A గ్రేడ్‌లో వున్న మహిళా సంఘాలన్నీ C గ్రేడ్‌లో పడిపోయాయని అన్నారు. గత ప్రభుత్వం రుణాలను మాఫీ  చేస్తామని హామీ ఇచ్చి.. చేతులేత్తేసిందని చెప్పారు. రుణాలు కట్టొద్దని చెప్పి మహిళలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపడయ్యాయని 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి వుంటే అక్కడితో భారం పోయేదని ఆయన అభిప్రాయపడ్డారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని .. అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామని జగన్ చెప్పారు.

వైఎస్సార్ ఆసరా, చేయూత కార్యక్రమాలపై బుధవారం రివ్యూ చేసిన సీఎం.. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలని.. ఆసరా డబ్బును బ్యాంకులు జమ చేసుకోలేని విధంగా అన్ ఇన్‌కర్డ్ ఖాతాల్లో జమ చేయాలని సీఎం సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios