ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.

2018లో హైకోర్టు చెప్పినా చంద్రబాబు స్థానిక ఎన్నికలు నిర్వహించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు నిర్వహించి వుంటే.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వచ్చేవని జగన్ అన్నారు.

రెండు నెలల్లో ఎన్నికలు వస్తాయనగా.. చంద్రబాబు 2 వేలు పెన్షన్ పెంచారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతాప్ రెడ్డితో రిజర్వేషన్లపై కేసు వేయించారని జగన్ అన్నారు.

59.89 శాతం రిజర్వేషన్లతో 2019లో ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2,134 కోట్లు బకాయిలు పెట్టారని... సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని జగన్ మండిపడ్డారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణం పథకానికి 1900 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.