ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంచలనం సృష్టించిన దిశ విషయంలో ఈ వ్యాఖ్యలు చేయటంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  దిశ విషయంలో అనుకోకుండా జరిగిన సంఘటనలో తెలంగాణ పోలీసులు చేసిన పనికి వారికి హ్యాట్సాఫ్ చెప్తున్నానని ఏపీ అసెంబ్లీలో వైయస్ జగన్ ప్రకటించారు.  అంతే కాదు పోలీసులపై కేసులు పెడుతున్న మానవహక్కుల సంఘాలను కూడా తీవ్రంగా విమర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ విషయంలో జరిగిన సంఘటనలో తెలంగాణ పోలీసులను మెచ్చుకుంటూ వారికి హాట్సాఫ్ చెప్తున్నానని, అసలు దమ్మున్న వాళ్ళు ఇలా చేసినప్పుడు అభినందించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఉన్న మిగతా ఏపీ శాసన సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

అలాగే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులపై  ఢిల్లీ నుండి వచ్చిన మానవహక్కుల సంఘం చేస్తున్న విచారణ సరికాదంటూ ఇలాంటివి సమాజంలోని ప్రజల్లో వ్యవస్థల పట్ల అపనమ్మకాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.