తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించడం పట్ల వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ మరణవార్తను తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే ఆయన కుమారుడికి ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

కరోనా పాజిటివ్‌గా తేలడంతో  దుర్గాప్రసాద్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం అక్కడి చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. 1985లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.  దుర్గాప్రసాద్ చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. 

నాటి నుంచి వైసీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఇదే సమయంలో కోవిడ్ ఉద్ధృతి పెరగడంతో ఆయన గూడూరుకే పరిమితమయ్యారు. అయితే ఆ సమయంలో నియోజకవర్గంలో కొన్ని చోట్ల పర్యటించడంతో అప్పుడే ఆయనకు వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.