Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ఏపీకి వచ్చిన వారు గమ్యస్థానం చేరేవరకు యాప్ ద్వారా ట్రాక్

అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటలకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆమేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

Ap cm Ys jagan reviews on corona situation in Andhra pradesh
Author
Amaravathi, First Published May 10, 2020, 4:17 PM IST


అమరావతి: అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటలకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆమేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

కరోనా వైరస్ నివారణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం నాడు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను  వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ సీఎంకు వివరించారు.

ఇతర రాష్ట్రాల్లోని ఏపీకి చెందిన వసల కార్మికులు, అలాగే రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల అంశాలపై  సీనియర్‌ అధికారి కృష్ణబాబు సీఎంకు తెలిపారు. 

విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు సోమవారం నుండి రాష్ట్రానికి వస్తారని అధికారులు సీఎంకు చెప్పారు. అమెరికా నుంచి వచ్చేవారు వైజాగ్, విజయవాడ, తిరుపతే కాకుండా  ముంబై, హైదరాబాద్, చెన్నైలాంటి విమానాశ్రయాలకూ చేరుకుంటారన్నారు.  వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.

విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌ కేంద్రాలకు చేరడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని  సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి వస్తున్నవారికి ఏ రాష్ట్రం కూడా ఇంతలా సదుపాయాలను ఏర్పాటు చేయడంలేదని అధికారులుగు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను పంపేటప్పుడు కూడా ఏ రాష్ట్రం చేయని విధంగా వారిని అన్నిరకాలుగా ప్రభుత్వం అండగా ఉంటోందన్న అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, కొందరు గ్రూపుల ఉన్న వారు తిరిగి రావటానికి తగిన విధంగా సహాయసహకారాలు అందిస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని సీఎంకు చెప్పారు అధికారులు.

also read:ఏపీలో ఐఎఎస్ అధికారుల బదిలీలు: జిల్లాల్లో అదనంగా జేసీ పోస్టింగ్‌లు

లాక్‌డౌన్‌ అనంతరం అనుసరించాల్సిన హెల్త్‌ప్రోటోకాల్‌ అంశంపై సమావేశంలో చాలాసేపు చర్చ జరిగింది.రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ తో ప్రారంభమైన  కోవిడ్‌–19 నివారణా చర్యల ప్రయాణం .. ఇవ్వాళ దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసే స్థాయికి చేరుకున్నామని అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్‌ అనంతరం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి కదలిక ప్రారంభమైతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి ప్రోటోకాల్‌ పాటించాలన్న దానిపై సమావేశంలో చర్చించారు.ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరిశీలన, పరీక్షలు చేయాలి, తర్వాత ఆ వ్యక్తి అనుసరించాల్సిన ఐసోలేషన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఒక ప్రోటోకాల్‌ తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వివిధ రాష్ట్రాలనుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశిస్తారని సీఎంకు తెలిపిన అధికారులు. ఈ 11 చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్నదానిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం అధికారులను కోరారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి పొందిన గమ్యానికి చేరుకోవడం వరకూ యాప్‌ద్వారా ట్రాక్‌ చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

ఆ తర్వాత  వారి వివరాలను ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త, అలాగే ప్రతి సచివాలయంలో ఉన్న హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయాలని సీఎం సూచించారు. 

హోంక్వారంటైన్‌ పాటించేలా చేయడం, తర్వాత పరీక్షలు చేయించడం తద్వారా వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు, అవసరమైన ఆస్పత్రికి తరలించడం లాంటి కార్యక్రమాలు నిరంతరం సాగేలా చూడాలన్నారు. 

కేంద్ర ప్రభుత్వం హోంక్వారంటైన్‌ సహా, క్వారంటైన్‌ నుంచి పంపించేటప్పుడు అనుసరించాల్సిన ప్రోటోకాల్‌పై మార్గదర్శకాలు విడుదలచేసిన విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు.

వీటిని దిగువ స్థాయిలో ప్రయోగాత్మకంగా అమలుచేసి.. ఆ విధానాల బలోపేతానికి కృషిచేయాలన్నారు.వీటన్నింటికీ సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొజీజర్స్‌ సిద్ధంచేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios