స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇకపై రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికే సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) . శుక్రవారం విద్యా శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేసేలా విధానం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికే సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం .. టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. దశలవారీగా స్కూళ్లలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఇకపోతే.. బాపట్లలోని జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులను గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. మూడో విడత విద్యా దీవెన కింద రూ.694 కోట్ల నిధులను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. సుమారు 11.02 లక్షల మంది విద్యార్ధులకు విద్యా దీవెన కింద లబ్ది చేకూరనుంది.
Also Read:పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలి: జగనన్న విద్యాదీవెన నిధులు రిలీజ్ చేసిన జగన్
ఈ సందర్భంగా బాపట్లలోని కాలేజీలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.రాష్ట్రంలోని ప్రతి భిడ్డ చదువుకోవాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం జగన్ చెప్పారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరనలు తీసుకొచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని తమ ప్రభుత్వం పీజు రీఎంబర్స్ మెంట్ ను అమలు చేస్తుందని సీఎం జగన్ చెప్పారు. అందుకే ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఎంతైనా ప్రభుత్వం చెల్లిస్తుందని జగన్ చెప్పారు. ఒక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్ధులుంటే అంతమందిని చదివించాలని సీఎం జగన్ కోరారు. చదువుకునే విద్యార్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ హమీ ఇచ్చారు. ప్రతి ఇంటి నుండి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐపీఎస్ లు కావాలన్నదే తన లక్ష్యమన్నారు.
పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. విద్యా రంగంపై గత మూడేళ్లలో రూ. 53 వేల ఖర్చు పెట్టామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యార్ధుల చదువు కోసం పేదలు అప్పులపాలు కాకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఆయన వివరించారు.అమ్మఒడిలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్టుగా జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు పాలనకు, తన పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూడాలని సీఎం జగన్ ప్రజలను కోరారు.
