Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలకాంశాలపై చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు  భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన  పలు అంశాలపై  అమిత్ షాతో  జగన్  చర్చించనున్నారు. 

AP CM YS Jagan  meets  Union Home Minister  Amit Shah
Author
First Published Dec 29, 2022, 10:45 AM IST

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారం నాడు ఉదయం భేటీ అయ్యారు.  బుధవారం నాడు రాత్రి  కేంద్ర హోంశాఖ మంత్రితో  జగన్ భేటీ కావాల్సి ఉంది. అయితే  కొన్ని కారణాలతో  అమిత్ షాతో భేటీ ఇవాళ ఉదయానికి వాయిదా పడింది.  రాష్ట్రానికి చెందిన  పలు  అంశాలపై జగన్  కేంద్ర మంత్రి అమిత్ షా తో  చర్చించనున్నారు. 

విభజన అంశాలు తెలంగాణ, ఏపీ మధ్య ఇంకా అపరిష్కతంగా  ఉన్న విషయాలను  సీఎం కేంద్ర మంత్రికి వవరించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన పూర్తి కాని సంస్థలు, అప్పులు, ఆస్తుల విసయాన్ని పరిష్కరించాలని  జగన్  కోరే అవకాశం ఉంది.  ఇప్పటికే  తెలంగాణ నుండి విద్యుత్ బకాయిల పెండింగ్  అంశాన్ని ప్రధాని వద్ద సీఎం ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య  అపరిష్కృతంగా  ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్  కేంద్ర మంత్రిని కోరనున్నారు.

ఏపీ పునర్విబజన చట్టం  2014 తో పాటు  రాష్ట్రానికి  రావాల్సిన నిధులు, తెలంగాణ రాష్ట్రం నుండి  విడుదల కావాల్సిన బకాయిల వంటి అంశాలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. ఈ  నెల  27వ తేదీ రాత్రి  ఏపీ సీఎం వైఎస్ జగన్  న్యూఢిల్లీకి వచ్చారు.  నిన్న  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై  సీఎం జగన్ చర్చించారు.  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ నిధులతో పాటు  సవరించిన  అంచనాల ఖరారు,   నిర్వాసితులకు  పరిహారం వంటి అంశాలపై ప్రధాని మోడీతో  సీఎం జగన్ చర్చించారు.

 తెలంగాణ రాష్ట్రం నుండి  విడుదల కావాల్సిన నిధుల విషయంలో  కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా  సీఎం కోరారు.  విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధానితో భేటీ తర్వాత  ఏపీ సీఎం వైఎస్ జగన్   కేంద్ర పర్యావరణ, అటవీ శాఖమంత్రి భూపేంద్ర యాదవ్ తో  సమావేశమయ్యారు.  రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన  అనుమతుల విషయమై  చర్చించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios