చంద్రబాబుది నారీ వ్యతిరేక చరిత్ర:వైఎస్ఆర్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన జగన్

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద  నాలుగో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ విడుదల చేశారు.  అమలాపురంలో నిర్వహించిన  కార్యక్రమంలో  జగన్  డ్వాక్రా సంఘాలను నిధులు విడుదల చేశారు.

AP CM YS Jagan  Releases  YSR Sunna Vaddi  Funds lns

అమలాపురం:చంద్రబాబుది నారీ వ్యతిరేక చరిత్ర  అని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.వైఎస్ఆర్ సున్నా వడ్డీ  పథకం కింద  నాలుగో విడత నిధులను  ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన  ప్రసంగించారు.డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ  చేస్తామని చంద్రబాబు ఆనాడు  మహిళలను హామీ ఇచ్చారన్నారు. రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళను చంద్రబాబు రోడ్డుపై నిలబెట్టారని ఆయన  విమర్శించారు. 

చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే  బాధనిపిస్తుందన్నారు. 2016లోనే  చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారన్నారు. అది వారి చరిత్ర, అది నారా వారి చరిత్ర, అది నారీ వ్యతిరేక చరిత్ర అంటూ చంద్రబాబు పాలన తీరును సీఎం జగన్ ఎండగట్టారు. మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. అందుకే సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్దరించినట్టుగా సీఎం జగన్ వివరించారు. ఈ కారణంగా తమ ప్రభుత్వంపై  పెనుభారం పడిందని ఆయన  గుర్తు  చేశారు. 

తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని  సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత,  వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ బీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాలను  అమలు చేస్తూ  పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు.  దేశ చరిత్రలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని  ఆయన గుర్తు  చేశారు. సున్నా వడ్డీ పథకం కింద మూడు విడతల్లో  రూ. 19 వేల కోట్లను లబ్దిదారులకు అందించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. కోటి 5 లక్షల మంది మహిళలకు సున్నా వడ్డీ నిధులు అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ  తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం జగన్ చెప్పారు.

also read:మా పథకాలతో ఫ్యూజులు పోయాయి: విపక్షాలపై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

పేదలకు  30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామన్నారు.గతంలో ఏ ప్రభుత్వం కూడ ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇవ్వని విషయాన్ని సీఎం జగన్ గుర్తు  చేశారు.ఇళ్ల స్థలాలతో పాటు  22 లక్షల ఇళ్లు కూడ కట్టిస్తున్నామన్నారు సీఎం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు  రూ. 6 వేల 141 కోట్లు ఖర్చు చేసినట్టుగా  సీఎం  వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios