Asianet News TeluguAsianet News Telugu

గ్రామ సచివాలయం ఫలితాలు విడుదల

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన పరీక్షలు సెప్టెంబర్ 8 వరకు అంటే వారం రోజులపాటు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 19 లక్షల 74వేల మంది హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 19 రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. 

ap cm ys jagan released ap grama sachivalayam results
Author
Amaravathi, First Published Sep 19, 2019, 2:52 PM IST

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్ష ఫలితాలను విడదుల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఫలితాలను విడుదల చేశారు. 

సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన పరీక్షలు సెప్టెంబర్ 8 వరకు అంటే వారం రోజులపాటు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 19 లక్షల 74వేల మంది హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 19 రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. 

అయితే పదిరోజుల అనంతరం పరీక్షా ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఈ పరీక్షఫలితాల విడుదల కార్యక్రమంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాక మంత్రి బొత్స సత్యనారాయణ, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. 

గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30 నుంచి అక్టోబర్ 1 వరకు శిక్షణ ఇస్తారు. అనంతరం అక్టోబర్ 2 నుంచి ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్త మవుతుంది. 
"

Follow Us:
Download App:
  • android
  • ios