Asianet News TeluguAsianet News Telugu

సై అంటే సై అంటోన్న జోగి, వసంత... మైలవరంపై జగన్ ఫోకస్, త్వరలో కార్యకర్తలతో భేటీ

మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేశ్ సై అంటే సై అనేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో జగన్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ap cm ys jagan ready to meet with ysrcp activists from mylavaram assembly constituency
Author
First Published Dec 14, 2022, 6:54 PM IST

వైసీపీ నేతల మధ్య విభేదాలతో సమస్యాత్మకంగా మారిన నియోజకవర్గాలపై సీఎం వైఎస్ జగన్ దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలపై సమావేశం కానున్నారు. ఇప్పటికే మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేశ్ సై అంటే సై అనేలా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరిద్దరిని పిలిపించి సజ్జల మాట్లాడారు. కార్యకర్తల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు జగన్. 

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్  కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేదంటూ మాజీ మంత్రి, వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అధికార వైసీపీలో కూడా ఆయన కామెంట్స్ ప్రకంపనలు సృష్టించాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జలను కలిశారు. తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని, తన తండ్రి వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వసంత కృష్ణా ప్రసాద్ తెలిపారు. సజ్జలకు అన్ని విషయాలను వివరించినట్లు తెలిపారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకోవద్దని కోరినట్లు వివరించారు. తనకు జోగి రమేశ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను సజ్జలకు వివరించినట్లు కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోగ్యం బాలేక గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో ఉన్నానని ఆయన తెలిపారు

ALso REad:పార్టీలో కొందరు ఇబ్బంది పెడుతున్నారు.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం: వసంత కృష్ణ ప్రసాద్

అంతకుముందు కృష్ణ ప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తనకు మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయనకు తన మద్దతును కొనసాగిస్తానని చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, ఊహాగానాలను ఆయన ఖండించారు. మైలవరం నుంచి మళ్లీ పోటీ చేయాలని జగన్ మోహన్ రెడ్డి కోరితే చేస్తానని, లేదంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా అసెంబ్లీలో కూర్చునే అవకాశం సీఎం కల్పించారని చెప్పారు. తన తండ్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ఆయన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios