అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకిరించిన సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా చాలా కష్టపడిందని అభినందించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడటమేకాకుండా ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా కూడా పోరాడారని గుర్తు చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో సోషల్ మీడియా పాత్ర అద్భుతమని కొనియాడారు. గతంలో ఎలాగైతే సోషల్ మీడియా టీం సహాయ సహకారాలు అందించిందో భవిష్యత్ లో కూడా అలాంటి సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ కోరారు.