అమరావతి: రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ చెప్పారు. 

శుక్రవారం నాడు లైట్ హౌస్ ప్రాజెక్టు ఇళ్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.

also read:లైట్ హౌస్ ప్రాజెక్టు ఇళ్ల నిర్మాణం: మోడీ శంకుస్థాపన

రాష్ట్రంలో 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. 68,677 ఎకరాల భూమిని సేకరించి పేదలకు అందిస్తున్నట్టుగా జగన్ చెప్పారు. 16,098 ఈడబ్ల్యూఎస్ కాలనీలను అభివృద్ది చేస్తున్నామన్నారు. 2022 లోపే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని  లక్ష్యంగా పెట్టుకొన్నామన్నారు.మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ మహిళల పేరిట ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. 15 రోజుల పాాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల కోర్టు కేసుల కారణంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ విషయమై చంద్రబాబుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.