అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లో గ్యాస్ లీక్, పలువురి అస్వస్థత: మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ ఆదేశం
అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సెజ్ లో గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు.ఇవాళ ఉదయం సెజ్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది.ఈ విషయమై సీఎంఓ అధికారులు జగన్ కు వివరాలు అందించారు.
విశాఖపట్టణం: Anakapalle జిల్లాలోని Atchutapuramలో అమ్మోనియా Gas leak ఘటనపై ముఖ్యమంత్రి YS Jagan శుక్రవారం నాడు ఆరా తీశారు. అచ్యుతాపురం ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు సీఎంకు వివరించారు. గ్యాస్ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు.
Brandixలో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందరిని ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని వివరించారు. అమ్మోనియా ఎక్కడ నుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు.
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లో ఇవాళ అమ్మోనియం గ్యాస్ లీకైంది.వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.
అచ్యుతాపురం బ్రాాండిక్స్ ఎస్ఈజడ్ లో ఓ కంపెనీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని క్వాంటం సీడ్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.Gas లీక్ కావడంతో భయంతో ఉద్యోగులు పారిపోయారు. గ్యాస్ లీక్ కావడంతో తల తిరగడం, వాంతులు అయినట్టుగా ఉద్యోగులు చెబుతున్నారు.
దీంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు భయంతో పారిపోయారు. నలుగురు మహిళలకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. గ్యాస్ లీకేజీ విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవాళ ఉదయం బ్రాండిక్స్ సెజ్ లోని ఓ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది.. దీని ప్రభావం క్వాంటం సీడ్స్ ఉద్యోగులపై పడింది. ఒక్కసారిగా పలువురు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ గ్యాస్ ను పీల్చిన వారు వాంతులు, తల తిరిగినట్టుగా చెబుతున్నారు. మరో వైపు అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే గ్యాస్ లీకేజీకి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు.
also read:అనకాపల్లి జిల్లాలో కలకలం: అమ్మోనియా గ్యాస్ లీక్, పలువురికి అస్వస్థత
అమ్మోనియా గ్యాస్ ను పీల్చిన వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఎక్కువగా మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని కనిపించిన వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు. అనకాపల్లి ఆసుపత్రిలో బాధితులను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే ఈ ఘటన చోటు చేసుకొందని కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ ఘటనపై నివేదిక కోరినట్టుగా ఏపీ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. ఘటన స్థలానికి ఎస్పీ, కలెక్టర్ వెళ్లారని మంత్రి ప్రకటించారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి అధికారులు సమగ్ర నివేదిక ఇస్తారని చెప్పారు.
విశాఖ జిల్లాలో 2020 మే 7వ తేదీన విశాఖ పాలీమర్స్ ఫ్యాక్టరీలో విషవాయువులు లీకై 12 మంది మరణించారు.ఈ ప్రమాదం జరిగిన సమయంంలో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు అన్ని రకాల భద్రత చర్యలను తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆయా ప్యాక్టరీలకు సూచనలు చేసింది.