అనకాపల్లి జిల్లాలో కలకలం: అమ్మోనియా గ్యాస్ లీక్, పలువురికి అస్వస్థత

అనకాపల్లి జిల్లా  అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్ లో  గ్యాస్ లీకైంది.  దీంతో వంద మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు.

100 employees fall Ill due to gas leakage at Brandix sez in anakapalle district

విశాఖపట్టణం: Anakapalle జిల్లా అచ్యుతాపురం Brandix ఎస్ఈ‌జడ్ లోని   ఓ కంపెనీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో  సమీపంలోని   క్వాంటం సీడ్స్  కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.Gas లీక్ కావడంతో భయంతో ఉద్యోగులు పారిపోయారు. గ్యాస్ లీక్ కావడంతో  తల తిరగడం, వాంతులు అయినట్టుగా ఉద్యోగులు చెబుతున్నారు. 

దీంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు భయంతో పారిపోయారు. నలుగురు మహిళలకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. గ్యాస్ లీకేజీ విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవాళ ఉదయం బ్రాండిక్స్ సెజ్ లోని ఓ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది.. దీని ప్రభావం క్వాంటం సీడ్స్  ఉద్యోగులపై పడింది. ఒక్కసారిగా పలువురు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ గ్యాస్ ను పీల్చిన వారు వాంతులు, తల తిరిగినట్టుగా చెబుతున్నారు. మరో వైపు అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే గ్యాస్ లీకేజీకి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు.

అమ్మోనియా గ్యాస్ ను పీల్చిన వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.  ఎక్కువగా మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని కనిపించిన వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు. అనకాపల్లి ఆసుపత్రిలో బాధితులను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే ఈ ఘటన చోటు చేసుకొందని కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. 

ఈ ఘటనపై నివేదిక కోరినట్టుగా ఏపీ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. ఘటన స్థలానికి ఎస్పీ, కలెక్టర్ వెళ్లారని మంత్రి ప్రకటించారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి అధికారులు సమగ్ర నివేదిక ఇస్తారని చెప్పారు.

విశాఖ జిల్లాలో 2020 మే 7వ తేదీన విశాఖ పాలీమర్స్  ఫ్యాక్టరీలో విషవాయువులు లీకై 12 మంది మరణించారు.ఈ ప్రమాదం జరిగిన సమయంంలో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు అన్ని రకాల భద్రత చర్యలను తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆయా ప్యాక్టరీలకు సూచనలు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios