ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారంనాడు  తిరుమల వెంకటేశ్వరస్వామిని ఇవాళ దర్శించుకున్నారు.  

తిరుపతి: ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారంనాడు  తిరుమల వెంకటేశ్వేరస్వామిని దర్శించుకున్నారు.శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని  ఏపీ సీఎం వైఎస్ జగన్  నిన్న  తిరుమలకు చేరుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఇవాళ  ఉదయమే ఏపీ సీఎం వైఎస్ జగన్  శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. సీఎం జగన్ తో పాటు  టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులకు మహాద్వారం వద్ద  ఆలయ ప్రధాన అర్చకులు  ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకున్నారు.  శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్ కు  వేద పండితులు  ఆశీర్వచనాలు అందించారు. అంతేకాదు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.