వైభవంగా ఒంటిమిట్ట కల్యాణోత్సవం.. సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌

ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. 

ap CM ys Jagan Offer Pattu Clothes to vontimitta kodandarama swamy

వైఎస్‌ఆర్‌ జిల్లా (ysr distirct) ఒంటిమిట్టలోని (vontimitta kodandarama swamy temple) శ్రీకోదండరాముని కల్యాణోత్సవం (seetarama kalyanam) ఘనంగా జరుగుతోంది. సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి కోదండ రామాలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్.. స్వామివారికి పట్టు పస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ (biswabhusan harichandan) దంపతులు సైతం పట్టువస్త్రాలు పంపించారు. వారి తరఫున రాజ్‌భవన్‌ అధికారులు శ్రీరామచంద్రస్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. 

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) దంపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా స్వామివారి కల్యాణం ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి పరిస్ధితులు చక్కబడటంతో లక్షలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అంతకుముందు Ontimittaలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు 10 గంటల వరకు జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు. రాత్రి 11 నుండి 12 గంటల వరకు గజవాహనసేవ అత్యంత వేడుకగా జరగనుంది.

కాగా.. శ్రీ కోదండ‌రామస్వామి ఆల‌యంలోని సీత‌మ్మ‌వారికి నిరుడు ఆగస్ట్ 25న ఓ భ‌క్తుడు బంగారు హారాన్ని బ‌హూక‌రించాడు. క‌ర్నూల్‌కు చెందిన సి.పుల్లారెడ్డి బుధ‌వారం ఉద‌యం రూ.1.85 ల‌క్ష‌ల విలువ గ‌ల 38.042 గ్రాముల బంగారు హారాన్ని అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించాడు. ఈ సందర్భంగా ఆల‌య‌ ఏఈవో ముర‌ళీధ‌ర్‌కు ఆయన హారాన్ని అంద‌జేశారు. అనంత‌రం వేద పండితులు హారానికి పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారికి అలంక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయన సూప‌రింటెండెంట్ వెంక‌టేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ గిరి, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios