అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆగష్టు 1న జెరూసలేంలో పర్యటించనున్నారు. ఆగష్టు 1 నుంచి 4 వరకు జెరూసలేంలోనే జగన్ పర్యటించనున్నారు. 

ఆగష్టు 4న రాత్రికి జెరూసలేంలో బయలుదేరి మరునాడు అమరావతికి రానున్నారు. జగన్ పర్యనలో కుటుంబ సభ్యులతోపాటు ఆయన భద్రతా అధికారులు ఎస్ఎస్ జీ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి కూడా జెరూసలేం వెళ్లనున్నారు. 

ఇకపోతే జెరూసలేం పర్యటన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు పర్యటించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జెరూసలేం పర్యటించారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి జెరూసలేం వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ గడిపారు. జెరూసలేం అంటే వైయస్ కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టమైన ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేంలో పర్యటించారు. అలాగే జగన్ సీఎం అయిన తర్వాత తండ్రి మాదిరిగానే జెరూసలేంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. 

ఇకపోతే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం జూలై 28న అమెరికాకు వెళ్లనున్నారు. జూలై 28న అమెరికా వెళ్లి మళ్లీ ఆగష్టు 1న రాష్ట్రానికి రానున్నారు. ఏపీ ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకీ వస్తున్న రోజే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లనున్నారు.