Asianet News TeluguAsianet News Telugu

రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన... అమ్మ ఒడి నిధులు విడుదల, షెడ్యూల్ ఇదే

ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి పథకం మూడో విడత నిధులను ఆయన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

AP CM YS Jagan Mohan Reddy tour in Srikakulam on June 27
Author
Srikakulam, First Published Jun 26, 2022, 9:44 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys jagan) సోమవారం శ్రీకాకుళం  జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి సీఎం అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి టూర్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి 9.20 గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. 9.30 గంటలకు విమానంలో బయల్దేరి విశాఖపట్నంకి 10.15కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.25కు హెలీకాప్టర్‌లో విశాఖపట్నం నుంచి బయలుదేరి 11 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటల నుంచి 11.15 వరకు ప్రజలు, అధికారులతో సీఎం ముచ్చటిస్తారు. 

అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉన్న హెలీప్యాడ్‌ నుంచి బయల్దేరి రోడ్డు మార్గాన కోడి రామ్మూర్తి స్టేడియానికి 11.25కు చేరుకుంటారు. 11.45 నుంచి 11.55 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో జగన్ ముచ్చటిస్తారు. 11.55 నుంచి 12.40 వరకు సీఎం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12.40 నుంచి 12.45 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు బటన్‌ నొక్కుతారు. 12.45కి సభా వేదిక నుంచి బయలుదేరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 1.35కు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 1.45కు విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి 2.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 2.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. 

Also REad:పిల్లలను స్కూల్‌కి పంపితేనే ‘అమ్మ ఒడి’ .. తేల్చేసిన మంత్రి బొత్స

కాగా.. జగన్ సర్కారు (ys jagan govt) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో అమ్మఒడి (amma vodi) ఒకటనే సంగతి తెలిసిందే. విద్యార్థులను బడి బాటపట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం కింద ప్రభుత్వం.. తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేలు జమ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి గాను అమ్మ ఒడి నిధులను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే పాఠశాలలకు వెళ్లకపోవడంతో.. హాజరు ఆధారంగా 51 వేల మందిని అమ్మఒడికి అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మరో 50 వేల మందికి ఈ పథకాన్ని నిలిపేసింది. 

అంతేకాదు.. కరెంట్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటిన వారికి.. 75 శాతం హాజరు లేకపోయినా అమ్మఒడికి అనర్హులని విద్యాశాఖ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు కొత్తది ఉండాలని.. కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలని సూచించింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవాలని.. అకౌంట్ పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. అంతేకాదు ఈ ఏడాది అమ్మఒడి కింద రూ.13 వేల చొప్పున మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ స్పందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios