షుగర్ ఫ్యాక్టరీలు, మిల్క్ డెయిరీలపై శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు.
షుగర్ ఫ్యాక్టరీలు, మిల్క్ డెయిరీలపై శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు.
రైతులు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి ధర రావాలని.. ధరల విషయంలో రైతులకు న్యాయం జరగాలన్నారు. ఈ భేటీలోనే పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటుగా అమూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూలై 15 లోగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
అనంతరం జగన్ మాట్లాడుతూ.. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ, ఉత్పత్తులకు మార్కెటింగ్ దిశగా అడుగులు వేయాలన్నారు. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా కృషి చేయాలని జగన్ ఆదేశించారు.
రైతుల్ని దోచుకునే పరిస్ధితి ఎక్కడా ఉండకూడదన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మున్సిపల్ శాఖమంత్రి బొత్ససత్యన్నారాయణ, పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
