ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ  ఉద్యోగులకు శుభవార్త. 711 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ స్థానికతతో ఏపీలో పనిచేస్తున్నారు వీరంతా.

బుధవారం తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్‌ను కలిశారు. తమ కుటుంబాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయిని, తాము ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేయటం ఇబ్బందిగా ఉందని సీఎం జగన్‌కు వారు వివరించారు.

తమను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సందిగా ఆదేశాలు చేశారు.

ఆ వెంటనే క్లాస్-3, క్లాస్ - 4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ ఉద్యోగులు. ఉద్యోగుల పక్షపాతిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని వారు ప్రశంసించారు. 

గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించగా, సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ నుంచి ఏపీకి సంబంధిత ఫైల్‌ను పంపింది. ఉద్యోగుల బదిలీ ఫైల్‌ను క్లియర్ చేసి తెలంగాణ రాష్ట్రానికి పంపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.