విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ఏపీ  ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జరయ్యారు. విశాఖలోని ది పార్క్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు సుమ-చిన్నం నాయుడును సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

అంతకుముందు సుమ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి బీచ్ రోడ్‌లోని పార్క్ హోటల్‌కు ఆయన రోడ్డు మార్గంలో చేరుకున్నారు.

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీ వాణి, ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మాధవి, బెల్లన చంద్రశేఖర్, బాలశౌరి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరయ్యారు