అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం సీఎం జగన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు.  

రాజ్ భవన్ లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు, చేసిన తీర్మానాలపైన చర్చించారు. ప్రజాసంక్షేమానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలపై గవర్నర్ తో పంచుకోనున్నారు. 

ఇకపోతే గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా భేటీ కానున్నారు. ఇకపోతే ఏపీ అసెంబ్లీలో 21బిల్లులు ప్రవేశపెట్టగా 20 బిల్లులుకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్రవేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు చట్టం చేసే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు సీఎం జగన్.