ఢిల్లీలో జగన్ బిజీబిజీ: కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం ఆయన చర్చిస్తున్నారు.
హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం ఆయన చర్చిస్తున్నారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం జగన్ గురువారం నాడు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొన్నారు. ఢిల్లీకి చేరుకొన్న సీఎం జగన్ ఇవాళ మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయమై సీఎం జగన్ చర్చించారు. పర్యావరణ అనుమతులు క్లియర్ చేసేలా చూడాలని ఆయన జవదేకర్ ను కోరారు. మరో వైపు రాష్ట్రానికి నిధుల విషయమై కూడ చర్చించారు.
also read:ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్: అమిత్ షా తో నేడు భేటీ
&nb
sp;
ప్రకాష్ జవదేకర్ తో భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన బకాయిల గురించి చర్చించనున్నారు. దీంతో పాటుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై కూడ జగన్ చర్చించనున్నారు. ఇవాళ రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. అమిత్ షా భేటీ ముగిసిన తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. రేపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తదితరులను సీఎం జగన్ కలవనున్నారు.