కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం అక్బర్ రోడ్‌లోని అమిత్ షా నివాసానికి వెళ్లారు.

విభజన సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు.

అంతకు ముందు ఉదయం అమిత్ షా అధ్యక్షతన జరగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.