ఢిల్లీ పర్యటనలో వున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు వున్నారు.
ఢిల్లీ పర్యటనలో వున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలపై ఆయన కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల రెవెన్యూ లోటు నిధులు, ఇతర పెండింగ్ నిధులు విడుదలపై నిర్మలా సీతారామన్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు వున్నారు. రేపు నీతి ఆయోగ్ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
Add Asianetnews Telugu as a Preferred Source

