ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలు, కరోనాపై గవర్నర్ తో సీఎం చర్చించే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ఎస్ఈసీ వ్యవహరిస్తున్నతీరుపై సీఎం జగన్ గవర్నర్ తో చర్చించనున్నట్టుగా సమాచారం.

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీన సమావేశం నిర్వహించంది. అయితే ఈ సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు.

కరోనా కేసులు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడే వద్దని వైసీపీ వాదిస్తోంది. కరోనా కేసులు తగ్గాక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉన్నామని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

డిసెంబర్  మొదటివారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడ ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని సమాచారం.