సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను విజయవాడ నోవాటెల్ హోటల్‌లో ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నోవాటెల్‌కు చేరుకున్న సీఎం దంపతులు .. సీజేఐ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను విజయవాడ నోవాటెల్ హోటల్‌లో ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నోవాటెల్‌కు చేరుకున్న సీఎం దంపతులు .. సీజేఐ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈకార్యక్రమానికి సీఎం జగన్, రాష్ట్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
కాగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి justice nv ramana, ముఖ్యమంత్రి YS Jagan ఒకే వేదిక మీద కనిపించనుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం.. నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, మరో ముగ్గురు న్యాయమూర్తులపై సీఎం జగన్ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విషయాల్లో జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని, అలాగే ఇతరేతర అంశాలను ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణను ప్రత్యర్థి వర్గంలో వైసీపీ జమ కట్టి, పరోక్షంగా విమర్శలు కూడా చేస్తూ వుంటుంది. జస్టిస్ ఎన్వీ రమణ చివరికి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ALso Read:ఒకే వేదికపైకి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం జగన్.. నాడు ఫిర్యాదు, నేడు తేనీటి విందు..
ఇదిలా ఉండగా, శుక్రవారం సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా పొన్నవరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని ప్రసంగించారు. పొన్నవరం, కంచికచర్ల లోనే తన ప్రాధమిక విద్య కొనసాగిందని జస్టిస్ ఎన్వీరమణ గుర్తుచేసుకున్నారు. 1960వ దశకంలోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం పొన్నవరం అని ఆయన ప్రశంసించారు. తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉండాలని .. కష్టపడే తత్వం ఉన్న తెలుగు వాళ్లు ప్రపంచ దేశాల్లోనూ పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నారని ఎన్వీ రమణ కొనియాడారు. తన చిన్ననాటి మిత్రులను కలవడం సంతోషంగా ఉందని.. ప్రజలంతా ఐక్యంగా ఉండి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.
