Asianet News TeluguAsianet News Telugu

2024లో విజయమే లక్ష్యం.. ఇకపై నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో భేటీ , త్వరలో కార్యాచరణ : జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

ap cm ys jagan meeting with ysrcp district presidents and regional coordinators in tadepalli
Author
Tadepalli, First Published Jul 22, 2022, 9:51 PM IST

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (ap assembly elections) మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆగస్ట్ 4 నుంచి ప్రతి నియోజకవర్గంలో 50 మంది కార్యకర్తలతో భేటీ అవుతానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తానని సీఎం తెలిపారు. పార్టీ కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని.. ఎవరి బాధ్యతలను వారు పూర్తిగా నిర్వర్తించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 

వారి సొంత నియోజకవర్గాలతో పాటు.. పార్టీ అప్పగించిన బాధ్యతలను కూడా చూసుకోవాలన్నారు. పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలని జగన్ పేర్కొన్నారు. నెలలో ఆరు సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సమర్ధంగా పనిచేస్తే మళ్లీ గెలవడం అసాధ్యం కాదని.. ప్రతి సచివాలయానికి త్వరలో రూ.20 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ చెప్పారు. జిల్లా, మండల, నగర కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. బూత్ కమిటీ నుంచి ప్రతి కమిటీలోనూ మహిళలకు ప్రాధాన్యత వుండాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 

ALso Read:అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు సీఎం జగన్... వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శ

మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) కోనసీమ జిల్లా (ambedkar konaseema district) పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25న జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం. కోనసీమ జిల్లాలో వరద ఉద్ధృతి తగ్గినా , లంక గ్రామాల ప్రజలను కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరద తగ్గింది కానీ.. బురదతో ఇబ్బందిపడుతున్నారు లంక గ్రామాల ప్రజలు. లంక గ్రామాల్లో వరద నీరు తగ్గడంతో ఇళ్లకెళ్లి.. శుభ్రం చేసుకుంటున్నారు గ్రామస్తులు. భారీగా పంటనష్టం వాటిల్లింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios