పట్టాభి అరెస్ట్: తలుపులు పగులగొట్టి బలవంతంగా లాక్కెళ్లారని భార్య
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను భారీ బందోబస్త్ మధ్య గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుల తీరుపై పట్టాభి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు బలవంతంగా లోనికి వచ్చారని ఆమె ఆరోపించారు
టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను (kommareddy pattabhi) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను భారీ బందోబస్త్ మధ్య గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుల తీరుపై పట్టాభి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు బలవంతంగా లోనికి వచ్చారని ఆమె ఆరోపించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె ఆరోపించారు. ఈ విధంగా అరెస్ట్ చేయడంపై కోర్టుకెక్కుతామని పట్టాభి భార్య హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా చూపించలేదని ఆమె ఆరోపించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామన్నారని ఆమె ఆరోపించారు. మరోవైపు పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ శ్రేణులు (ysrcp) భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత పట్టాభి ఇల్లు, తెలుగుదేశం కార్యాలయాలపై అధికార పార్టీ శ్రేణులు దాడులుచేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది నేరమని, దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే పట్టాభి కావాలనే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ అధికార పార్టీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందంటూ వారు విమర్శిస్తున్నారు.
Also Read:వాడు వీడు అంటూ లోకేష్, బాబులపై కొడాలి నాని తిట్లదండకం
కాగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు (nakka ananda babu) పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ (tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా (ganja cultivation in andhra pradesh) మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ (telangana police), తమిళనాడు (tamilnadu police) పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు.
నిన్న మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు (ap police) ఆనందబాబు ఇంటికి రావడంపై పట్టాభిపై మండిపడ్డారు. నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.. ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు.
"