ఉండవల్లి వద్ద కృష్ణా నది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

 ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్ట  విస్తరణ పనులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. రూ. 150 కోట్లతో కరకట్ట విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టనుంది.

AP CM YS Jagan lays foundation stone for karakatta works lns

విజయవాడ: ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్ట  విస్తరణ పనులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. రూ. 150 కోట్లతో కరకట్ట విస్తరణ పనులను ప్రభుత్వం చేపట్టనుంది.ఉండవల్లి కొండవీటి వాగు సమీపంలో పైలాన్ ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ ను ఇవాళ సీఎం జగన్ ఆవిష్కరించారు. కొండవీటి వాగు నుండి రాయపూడి వరకు కరకట్ట విస్తరణ పనులను  చేపట్టనుంది ప్రభుత్వం.

15 కి.మీ. పొడవున  10 మీటర్ల వెడల్పుతో కరకట్ట విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.కొండవీటి వాగు 15.525 కి.మీ నుండి ఈ పనులను ప్రారంభించనుంది ప్రభుత్వం. 10 మీటర్ల వెడల్పుతో  రెండు వైపులా రోడ్డును నిర్మించనున్నారు. రెండు వైపులా పాదచారులు నడిచేందుకు వీలుగా రోడ్డును ఏర్పాటు చేయనున్నారు.  అమరావతికి చెందిన ఎన్ 1, ఎన్ 3 రోడ్లతో  ఈ రోడ్డును లింక్ చేయనున్నారు.కరకట్ట పనుల విస్తరణ పనుల గురించి స్థానిక అధికారులు  సీఎం జగన్ కు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios