Asianet News TeluguAsianet News Telugu

హామీల అమలుతోనే ప్రజల ఆశీర్వాదాలు: వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన జగన్

ఒంగోలులో ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు సర్కార్ పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు.

AP CM YS Jagan launches YSR asara second phase
Author
Ongole, First Published Oct 7, 2021, 1:23 PM IST

ఒంగోలు:  పంచాయితీ ఎన్నికల నుండి పరిషత్ ఎన్నికల్లో ప్రజా ఆరణను మరువలేమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ysr asara  రెండో విడత కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒంగోలులో గురువారం నాడు  ప్రారంభించారు.

also read:ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్... రిపబ్లిక్ డే నాటికి సిద్దంకండి: సీఎం జగన్ కీలక ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు ప్రతి ఎన్నికల్లో  తమకు అపూర్వ విజయం అందించారని సీఎం ys jagan చెప్పారు. ఇచ్చిన మాట తప్పకుండా హామీలను అమలు చేసినందుకు గాను తమకు విజయాన్ని అందించి ప్రజలు ఆశీర్వాదాన్ని అందించారని సీఎం జగన్ చెప్పారు.

AP CM YS Jagan launches YSR asara second phase

పొదుపు సంఘాలకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలను మోసం చేశారని జగన్ విమర్శించారు. chandrababu naidu మాటలను నమ్మి డ్వాక్రా సంఘాలు అప్పుల్లో కూరుకుపోయారన్నారు.

బాబు సీఎంగా ఉన్న సమయంలో పొదుపు సంఘాలన్నీ నిర్వీర్యమయ్యాయని జగన్ విమర్శించారు.టీడీపీ హయంలో సున్న వడ్డీ పథకం కూడా రద్దు చేశారని సీఎం గుర్తు చేశారు.గత ప్రభుత్వంలో సీ, డీ గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు ఇప్పుడు ఏ గ్రేడ్‌లోకి వచ్చాయన్నారు. 

టీడీపీ సర్కార్ పొదుపు సంఘాలను మూతపడే స్థితికి తీసుకొస్తే అప్పులను తీర్చి మహిళలను ఆర్ధిక స్వావలంభన దిశగా తీసుకెళ్తున్నామని జగన్ తెలిపారు.వైఎస్ఆర్ ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా పొదుపు సంఘాల్లో నిర్ధరక ఆస్తులు  గణనీయంగా తగ్గిపోయాయని జగన్ చెప్పారు. 

AP CM YS Jagan launches YSR asara second phase

తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అందరి బాధలు చూశానని ఆయన గుర్తు చేసుకొన్నారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకొన్నట్టుగా సీఎం తెలిపారు. 

పాదయాత్ర సందర్భంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీకి సంబంధించిన ప్రసంగం వీడియో క్లిప్ ను సీఎం జగన్  ఈ సందర్భంగా సభికులకు చూపించారు. నాలుగు విడుతలుగా పొదుపు సంఘాల అప్పులను తీరుస్తామని ఇచ్చిన హామీ మేరకు  నిధులను పొదుపు సంఘాలకు  అందిస్తున్నామని సీఎం వివరించారు. 

వైఎస్ఆర్ ఆసరా రెండో విడత పథకం కింద రూ.6439 కోట్లను  లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నానని ఏపీ సీఎం జగన్ చెప్పారు.

ఇవాళ్టి నుండి ఈ నెల 18వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు విడతల్లో రూ.25.517 కోట్లను పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు.హోం మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, రెండు ఎమ్మెల్సీ పదవులను మహిళలకు కేటాయించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. 

వచ్చే ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు

వచ్చే ఏడాది ఆగష్టు నుండి వెలిగొండ ప్రాజెక్టు-1 టన్నెల్ ద్వారా నీటిని అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 2023 ఫిబ్రవరి నుండి రెండో టన్నెల్ ద్వారా నీటిని అందిస్తామని ఆయన వివరించారు. 

ఈ టన్నెల్ ద్వారా 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ తన తండ్రి చిరకాల వాంఛ అని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios